పన్ను చెల్లించకుంటే రెడ్ నోటీసులు జారీ చేస్తాం : అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు

పన్ను చెల్లించకుంటే రెడ్ నోటీసులు జారీ చేస్తాం : అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు

సూర్యాపేట, వెలుగు : మున్సిపాలిటీలో ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లించని గృహ, వాణిజ్య, వ్యాపార సంస్థల వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తామని అడిషనల్ కలెక్టర్ సూర్యాపేట మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి పి.రాంబాబు అన్నారు. ఆస్తులను జప్తు చేసి ఇంటి నల్లా కనెక్షన్ ను శాశ్వతంగా తొలిగిస్తామని హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో బకాయి పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ100 శాతం పన్ను వసూళ్లు చేయని రెవెన్యూ అధికారులు, బిల్ కలెక్టర్ల జీతాలు నిలిపివేస్తామన్నారు. టార్గెట్ ప్రకారం రోజుకు రూ.26 లక్షల పన్ను వసూళ్లు చేయాలన్నారు. సెలవు రోజుల్లో కూడా పన్ను వసూలు చేయాలని చెప్పారు. వివిధ శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థల వారు, ఇతర బకాయిదారులు వెంటనే మున్సిపాలిటీకి పన్ను చెల్లించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్, ఆర్వో కళ్యాణి, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.