న్యూఢిల్లీ: సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర లాభం 2025 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 9.76శాతం క్షీణించి రూ. 45.39 కోట్లకు చేరింది. కిందటేడాది రెండో క్వార్టర్లో ఈ బ్యాంకు రూ. 50.30 కోట్ల లాభం సంపాదించింది. తాజా క్వార్టర్లో మొత్తం ఆదాయం 29.89శాతం జంప్ చేసి రూ.554.65 కోట్లకు చేరుకుంది. పన్నుకు ముందు లాభం రూ. 60.15 కోట్లుగా ఉంది.
ఇది రెండో క్వార్టర్ 2024 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 67.68 కోట్ల నుంచి 11.12శాతం వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 2025 ఆర్థిక సంవత్సరం క్యూ2 లో 35.7శాతం పెరిగి రూ. 300 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో రూ. 221 కోట్లు వచ్చాయి. నికర వడ్డీ మార్జిన్ 9.7శాతానికి మెరుగుపడింది.