సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాభం రూ.70 కోట్లు

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  లాభం రూ.70 కోట్లు

హైదరాబాద్​, వెలుగు :  సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్​కు (ఎస్​ఎస్​ఎఫ్​బీ) జూన్ క్వార్టర్​లో నికర లాభం 47శాతం పెరిగి, రూ. 70 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.48 కోట్ల నికర లాభం వచ్చింది. క్రితం ఏడాది నికర వడ్డీ ఆదాయం రూ. 225 కోట్లు కాగా, ఈ సంవత్సరం మొదటి క్వార్టర్​లో నికర వడ్డీ ఆదాయం 31శాతం పెరిగింది రూ. 293 కోట్లకు చేరుకుంది.

బ్యాంకు నిర్వహణ లాభం రూ.117 కోట్ల నుంచి 23శాతం పెరిగి రూ.144 కోట్లకు చేరుకుంది. ఇన్‌‌‌‌క్లూజివ్ ఫైనాన్స్, కమర్షియల్ వెహికల్ వంటి కీలక వ్యాపారాలపై దృష్టి పెట్టడం ద్వారా ఈ వృద్ధి సాధ్యమైందని ఎస్​ఎస్​ఎఫ్​బీ తెలిపింది. మొత్తం డిపాజిట్లు 5,722 కోట్ల నుంచి రూ. 8,137 కోట్లకు పెరిగాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు