సూపర్ నేచురల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌తో.. సుశాంత్

సూపర్ నేచురల్  థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌తో..  సుశాంత్

పద్దెనిమిదేళ్ల  క్రితం ‘కాళిదాసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సుశాంత్..  కరెంట్, చి.ల.సౌ వంటి చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్నాడు. తర్వాత అల వైకుంఠపురములో, రావణాసుర, భోళా శంకర్  చిత్రాల్లో కీలక పాత్రల్లో  మెప్పించాడు. మంగళవారం సుశాంత్  పుట్టినరోజు. ఈ సందర్భంగా తను హీరోగా నటిస్తున్న 10వ చిత్రాన్ని  ప్రకటించారు. పృథ్వీరాజ్ చిట్టేసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంజీవని క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వరుణ్ కుమార్, రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో  సుశాంత్ రెండు డిఫరెంట్ లుక్స్‌‌‌‌లో కనిపించాడు.   పై భాగంలో స్టైలిష్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో కూల్‌‌‌‌గా కనిపిస్తుంటే,  కింద నీడలో మాత్రం క్రూరంగా కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు. అతని చుట్టూ  పుర్రెలు ఉండటం క్యూరియాసిటీని  క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం సూపర్ నేచురల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోందని, ఇందులో సుశాంత్ మేకోవర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని మేకర్స్ చెప్పారు.   

అనిరుధ్ కృష్ణమూర్తి స్క్రీన్‌‌‌‌ప్లే రాయడంతో పాటు, దర్శకుడు పృథ్వీరాజ్‌‌‌‌తో  కలిసి డైలాగ్స్ అందించాడు.  వైవిబి శివ సాగర్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. ఇతర టెక్నీషియన్స్, నటీనటులు వివరాలను త్వరలోనే  ప్రకటిస్తామన్నారు.