హీరో సుశాంత్ సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో సీబీఐ సంచలన నివేదిక

హీరో సుశాంత్ సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో సీబీఐ సంచలన నివేదిక

ముంబై: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) క్లోజ్ చేసింది. ఈ మేరకు శనివారం (మార్చి 22) ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఎటువంటి కుట్ర కోణం లేదని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. సుశాంత్ మరణానికి వెనక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని  పేర్కొంది. అలాగే.. సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సీబీఐ క్లోజ్ చేసింది. 

ALSO READ | Abhishek Bachchan: ఐశ్వర్య ఫోన్‌ చేస్తే..టెన్షన్కి గురవుతా.. భార్యపై అభిషేక్‌ బచ్చన్‌ షాకింగ్ కామెంట్స్

కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ జూన్ 14, 2020న ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానస్పద స్థితిలో మరణించాడు. బాలీవుడ్‌ స్టార్ హీరోగా చెలామణి అవుతోన్న సుశాంత్ మరణం బాలీవుడ్‎తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ మరణం వెనక కుట్ర కోణం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. సుశాంత్ మరణం వెనక పొలిటిషన్స్‎తో పాటు బాలీవుడ్ మాఫియా ఉందని ప్రచారం జరిగింది. 

ఈ నేపథ్యంలోనే నటి రియా చక్రవర్తి, ఇతరులు కలిసి సుశాంత్‎ను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఆర్థిక మోసం, మానసిక వేధింపులకు గురి చేశారని హీరో తండ్రి  కెకె సింగ్ పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్ నటి రియా  చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరీమణులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో పేర్కొంది. 

సుశాంత్ సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం  సృష్టించడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ మరణానికి గల కారణాలపై విచారణ మొదలుపెట్టింది. సుశాంత్ తండ్రి, నటి రియా చక్రవర్తి నమోదు చేసిన కేసులను లోతుగా దర్యాప్తు చేసి కేసుల విచారణ ముగించింది. దాదాపు ఐదేళ్ల పాటు సుశాంత్ కేసును ఇన్విస్టిగేట్ చేసిన సీబీఐ ఈ మేరకు శనివారం (మార్చి 22) ముంబై కోర్టులో క్లోబర్ రిపోర్టు దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనక ఎలాంటి కుట్ర లేదని సీబీఐ తేల్చింది. దీంతో సీబీఐ రిపోర్టుపై ముంబై కోర్టు. సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

సుశాంత్ తండ్రి కెకె సింగ్ పాట్నాలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ తర్వాత, ఆగస్టు 2020లో సిబిఐ దర్యాప్తును చేపట్టింది. నటి రియా చక్రవర్తి మరియు ఇతరులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆర్థిక మోసం మరియు మానసిక వేధింపుల ఆరోపణలు ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, రియా చక్రవర్తి ముంబైలో కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశారు, సుశాంత్ సోదరీమణులు అతని కోసం నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ పొందారని ఆరోపించింది.