
సుశాంత్, జాన్యా జోషి, విధి హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘పింటు కి పప్పీ’. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కీలక పాత్ర పోషించారు. శివ్ హరే దర్శకత్వంలో విధి ఆచార్య నిర్మించారు. మార్చి 21న హిందీతో పాటు సౌత్ లాంగ్వేజెస్ లోనూ సినిమా రిలీజ్ కానుంది. ‘కిస్ కిస్ కిస్సిక్’ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో సుశాంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మంచి కమర్షియల్ ప్యాకేజ్‌లా ఉంటుంది. ఎమోషన్, నవ్వులు, సర్‌ప్రైజ్‌లతో రోలర్‌కోస్టర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’ అని అన్నాడు. ఈ చిత్రంలోని ఎమోషన్ అందర్నీ కనెక్ట్ చేసేలా ఉంటుందని హీరోయిన్స్ జాన్యా జోషి, విధి చెప్పారు. గణేష్ ఆచార్య మాట్లాడుతూ ‘ఇందులో చాలా బ్యూటీఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఈ చిత్రంతో న్యూ ట్యాలెంట్ పరిచయం అవుతున్నారు. ఇదొక ఫ్యామిలీ ఫిల్మ్. అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం’ అని అన్నారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘ఇది కంప్లీట్ ఎంటర్‌టైనర్. ఇందులో తొమ్మిది పాటలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఐదు ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమా కూడా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా’ అన్నారు.