
సుశాంత్ సింగ్ మరణాన్ని ఇప్పటికీ ఎవరూ జీర్ణించు కోలేకపోతున్నారు. అతణ్ని అభిమానించేవారంతా ఇలా ఎలా జరిగింది అంటూ షాక్‌లోనే ఉన్నారు. వారందరూ ఓ కోరిక కోరారు.. సుశాంత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’ని థియేటర్‌లో రిలీజ్ చేయమని. ఆ మధ్య శింబు కూడా అదే మాటన్నాడు. చివరి సారిగా తనని బిగ్ స్క్రీన్ పై చూసుకునే అవకాశం ఫ్యాన్స్‌కి ఇవ్వాలని చెప్పాడు. కానీ అది జరిగేలా లేదు. థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జూలై 24న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘దిల్ బేచారా’ విడుదల కానుంది. కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో సంజనా సంఘీ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ ఓ కీలక పాత్ర పోషించాడు. సుశాంత్ కి నివాళిగా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సబ్ స్కైబర్స్, నాన్ సబ్ స్కైబర్స్ కి కూడా ఈ చిత్రాన్ని చూసే అవకాశం కల్పిస్తున్నారు.