
హర్యానాలో పాక్ ఐఎస్ ఐ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం (మార్చి3) హర్యానాలోని ఫరీదాబాద్ లో అబ్దుల్ రహమాన్ అనే ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు.అతని దగ్గర నుంచి రెండు హ్యాండ్ గ్రేనేడ్లు, రాడికల్ మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. అయోధ్య రామమందిరంపై దాడికి పాక్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉగ్రవాది అరెస్ట్ తో అయోధ్యలో హై అలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం.
యూపీకి చెందిన అబ్దుల్ రహమాన్ రామమందిరంపై దాడులే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.సెంట్రల్ ఏజెన్సీలు, ఫరీదాబాద్ STF, గుజరాత్ ATS పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదిని అరెస్ట్ చేసి గుజరాత్కు తరలించారు.