![ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుకు బెయిల్](https://static.v6velugu.com/uploads/2025/02/suspended-dsp-praneeth-rao-gets-conditional-bail_Cl7HRK3QFU.jpg)
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు (ఏ2) దుగ్యాల ప్రణీత్‌రావుకు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇన్వెస్టిగేషన్ అధికారులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది. రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది.
ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు న్యాయవాది పూచీకత్తులు సమర్పించారు. అయితే బెయిల్ ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ప్రణీత్‌రావు విడుదల కానున్నాడు.
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలోనే ఉన్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు సీబీఐ, ఇంటర్‌పోల్ ద్వారా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.