Delhi Liquor Scam : ఈడీ విచారణకు కవిత హాజరవుతారా..? లేదా..?

మార్చి 20వ తేదీన ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈడీ విచారణకు హాజరవడంపై సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై లాయర్లతో మంతనాలు జరుపుతున్నారు. పిటిషన్ త్వరగా విచారించాలంటూ ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. 

మరోవైపు.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలోనే మంత్రులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈడీ తదుపరి విచారణకు కవిత హాజరుకాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఉన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవితతో ఫోన్ లో మాట్లాడుతూ సూచనలు చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లీగల్ ఆప్షన్స్ ఉపయోగించుకున్న తర్వాతే విచారణకు అటెండ్ కావడంపై నిర్ణయం తీసుకుందామని  మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.

ఇంకోవైపు.. మార్చి 18వ తేదీన ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు హాజరుకానున్నారు.