కామారెడ్డి సహా నాలుగింటిపై సస్పెన్స్​!

  • సెకండ్ లిస్టులో ఇద్దరు కాంగ్రెస్​అభ్యర్థుల ప్రకటన
  • నిజామాబాద్​ రూరల్​లో డాక్టర్​ ఆర్​.భూపతిరెడ్డి
  • ఎల్లారెడ్డి కె. మదన్మోహన్​రావుకు కేటాయింపు
  • అర్బన్​సహా కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్​  పెండింగ్

నిజామాబాద్​/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​ టికెట్ల సస్పెన్స్​ ఇంకా ముగియలేదు. శుక్రవారం పార్టీ హైకమాండ్​ ప్రకటించిన సెకెండ్​ లిస్టులో  కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించి ఇంకా నాలుగు స్థానాలు పెండింగ్​ పెట్టారు. నిజామాబాద్​ రూరల్​ సెగ్మెంట్​లో డాక్టర్​ రేకులపల్లి భూపతిరెడ్డి, ఎల్లారెడ్డిలో కె.మదన్మోహన్​రావును క్యాండిడేట్లుగా కాంగ్రెస్​ పార్టీ ఎనౌన్స్​ చేసింది. ఏకాభిప్రాయం కుదరని నిజామాబాద్​ అర్బన్​, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్​ నియోజకవర్గాలపై  హైకమాండ్​ఇంకా కసరత్తు చేస్తోంది.  ఈనెల 15నాటి ఫస్ట్​ లిస్టులో బోధన్​, ఆర్మూర్​, బాల్కొండ నియోజకవర్గాల అభ్యర్థులను కాంగ్రెస్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

రూరల్​ లో డాక్టర్​ వైపే మొగ్గు

నిజామాబాద్​ రూరల్​ సెగ్మెంట్​నుంచి  క్యాండిడేట్​గా డాక్టర్​ రేకులపల్లి భూపతిరెడ్డి  వైపే హైకమాండ్​ మొగ్గు చూపింది. మార్కెట్​ కమిటీ మాజీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఇటీవల కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి  టికెట్​ కోసం పోటీపడ్డారు. ఇంతలో అనూహ్యంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​రావు పేరు తెరమీదకు రావడంతో టెన్షన్​ ఏర్పడింది. ఆయన పోటీకి ససేమిరా అనడంతో హైకమాండ్​కు భూపతిరెడ్డి, నగేశ్​రెడ్డి పేర్లు వెళ్లాయి. 2018లో కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్​ భూపతిరెడ్డిని పార్టీ కన్ఫర్మ్​ చేసింది. గత ఐదేండ్ల నుంచి పార్టీని అన్ని మూలలకు విస్తరించి ప్రజలకు చేరువగా ఉన్న భూపతిరెడ్డి సరైన అభ్యర్థి అని తేల్చింది. 

నెగ్గిన మదన్మోహన్​రావు పంతం

ఎల్లారెడ్డి విషయంలో  కె. మదన్​మోహన్​రావుకు హైకమాండ్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది.  ఇక్కడి టికెట్ కోసం కె.మదన్మోహన్ రావుతో పాటు  టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​ రెడ్డి అనుచరుడైన వడ్డేపల్లి సుభాశ్​ రెడ్డి  నువ్వానేనా అనే రీతిలో పోటీపడ్డారు.  వీరిద్దరూ గత 4 ఏండ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సామాజిక సేవా కార్యక్రమాలతో పట్టుసాధించారు. ఎవరికి వారు నియోజకవర్గంలో తమకంటూ ఒక వర్గాన్ని  ఏర్పాటు చేసుకున్నారు. వడ్డేపల్లి సుభాశ్​ రెడ్డికి రేవంత్​తో పాటు, జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మద్దతు ఇచ్చారు.  వీరిద్దరితో టికెట్ ప్రయత్నాలు గట్టిగా చేశారు.  

కె. మదన్మోహన్ రావు 2014లో టీడీపీ నుంచి ఎంపీగా  2019లో  కాంగ్రెస్ తరపున జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి స్పల్ప ఓట్లతో  ఓడిపోయారు.   ఆ తర్వాత నుంచి ఎల్లారెడ్డిలో అసెంబ్లీ  స్థానంపై ఫోకస్ చేశారు. స్టేట్ లోని సీనియర్ నేతలతో పాటు, ఏఐసీసీ ముఖ్య నేతల ద్వారా టికెట్ కోసం ప్రయత్నించారు.   ఈ స్థానంపై  స్ర్కీనింగ్ కమిటీలో  తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.  

ఎట్టకేలకు  హైకమాండ్​ మదన్మోహన్​ రావు పేరు ఖరారు చేసింది.  భంగపాటుకు గురైన సుభాశ్​రెడ్డి  నిర్ణయం ఏమిటనే దానిపై నియోజక వర్గంలో  చర్చ నడుస్తోంది.  2018 ఎన్నికల్లోనే టికెట్ ఆశించినా జాజాల సురేందర్​ కారణంగా అవకాశం లభించలేదు.  పార్టీముఖ్య నేతలు నచ్చజెప్పడంతో శాంతించారు.​