
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బుధవారం ( ఫిబ్రవరి 26, 2025 ) హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు. అయితే.. పోసాని అరెస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8:45 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో పోసాని కృష్ణ మురళి ని అదుపులోకి తీసుకోన్న పోలీసులు ఆయనను ఎక్కడికి తరలించారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఒబులవారిపల్లి పీఎస్ లో కేసు నమోదు చేసినట్లు నోటీస్ జారీ చేశారు పోలీసులు. పోసానిని మేజిస్ట్రేట్ ముందు హజరుపరచాలని అధికారులు నోటిసులో పేర్కొన్న క్రమంలో ఆయనను సంబేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకోని వస్తారా.. లేక ఒబులవారిపల్లి పిఎస్ కు తరలిస్తారా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. జిల్లా పోలీసు కార్యాలయంలో మీడీయా ముందు ప్రవేశ పెడతారా లేక వైద్య పరీక్షలు నిర్వహించి కడప కోర్టుకు తీసుకేళతారా అన్న అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా పోసానికి అరెస్ట్ నోటీసులో ఉన్న తేదీపై కూడా రచ్చ నెలకొంది. నోటీసులో ఇవాళ్టి ( ఫిబ్రవరి 27 ) తేదీ ఉండగా.. పోలీసులు ఆయనను బుధవారం ( ఫిబ్రవరి 26 ) అరెస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది.పోసాని కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్ట్ నోటీసులో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్ గా పేర్కొన్న పోలీసులు.. ఫోన్ నెంబర్లో మాత్రం ఓబులాపల్లి పీఎస్ అంటూ పేర్కొన్నారు. పోసానికి బెయిల్ రాకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
రహస్య ప్రాంతంలో విచారణ
పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు కడపలోని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఆయనను అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తరలించి.. అక్కడ సీఐ విచారణ చేసి, రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో పోసానిని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు.