కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత

ఆదిలాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఉద్దేశంతో సస్పెండ్ కు గురైన మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ సంజీవ్ రెడ్డి సస్పెన్షన్ ను ఎత్తివేశారు. మంగళవారం గాంధీభవన్ లో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో వీరిని పార్టీలోకి తీసుకున్నారు.