పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించాడనే కారణంతో సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వనపర్తి పట్టణంలో ట్రాఫిక్ డ్యూటీకి వెళ్లాలని ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి సూచించగా, ట్రాఫిక్ డ్యూటీ చేయనంటూ ఎస్ఐతో గొడవ పడి, ఆయన వ్యక్తిగత లాప్ టాప్‌ను పగలగొట్టాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కొత్తకోట సీఐ రాంబాబు విచారణ జరిపి ఎస్పీకి నివేదిక ఇవ్వడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.