హైకోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేత

కోవిడ్ వ్యాప్తి క్రమంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేస్తూ మంగళవారం  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష లేదా ఆన్ లైన్ విచారణపై జడ్జీలకు విచక్షణాధికారం ఉంటుందని  తెలిపిన హైకోర్టు.. తప్పనిపరిస్థితుల్లో  ప్రత్యక్ష విచారణ చేపడితే కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.