రాజన్న ఆలయంలో ఉద్యోగుల సస్పెన్షన్

రాజన్న ఆలయంలో ఉద్యోగుల సస్పెన్షన్

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్  చేసినట్లు ఈవో వినోద్​రెడ్డి తెలిపారు. స్వామి వారికి నివేదన తయారు చేసే వ్యక్తి మద్యం తాగి వంట చేయడంతో సీరియస్‎గా పరిగణించిన వో ఈఅతడిని సస్పెండ్​ చేశారు. ప్రతిరోజు ఉదయం 11. 30 గంటలకు జరగాల్సిన నివేదన శుక్రవారం అరగంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన బ్రాహ్మణుడు తప్ప తాగి డ్యూటీ చేయడంతో స్వామివారి నివేదన అరగంట ఆలస్యమైనట్లు గుర్తించారు. దీంతో బ్రాహ్మణుడు సంతోష్‎ను సస్పెండ్​ చేశారు. అలాగే ఆలయంలో వసతి గదుల కౌంటర్​ వద్ద డ్యూటీ చేసే ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈవో సస్పెండ్  చేశారు.