YCP : నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై  అధికార వైసీపీ చర్యలు చేపట్టింది. ఆనం రామనారయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సస్పెండ్ చేసినట్టుగా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ చేశామని, దర్యాప్తు తర్వాతే  ఎమ్మెల్యేలపై వేటు వేశామని సజ్జల తెలిపారు. దర్యాప్తులో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా పార్టీ గుర్తించిందని సజ్జల అన్నారు . ఒక్కో ఎమ్మెల్యేను చంద్రబాబు 15 నుంచి 20 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి ఉండవచ్చునని సజ్జల అన్నారు.