- మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న టైంలో అవకతవకలు
- జడ్చర్ల ఎమ్మెల్యే ఫిర్యాదుతో వేటు
జనగామ, వెలుగు : జనగామ జిల్లా మైనింగ్ ఏడీ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విజయ్‌కుమార్ మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న టైంలో ఓ ప్రైవేట్ సంస్థ అక్రమంగా మట్టి తరలించిందని, ఇందుకు సీనరేజీ కింద రూ. 5.12 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అయితే విజయ్‌కుమార్ జనగామకు ట్రాన్స్‌ఫర్ కావడానికి ఒక రోజు ముందు
నోటీసులను రద్దు చేసి అవకతవకలకు పాల్పడ్డారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ బుధవారం సాయంత్రం ఆర్డర్స్ జారీ చేశారు.