కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా పాలేరు జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ చంద్రబాబును ఉన్నతాధికారులు సస్పెండ్‌చేశారు. ఈ మేరకు ఆదివారం నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే స్టూడెంట్నాగేందర్కరెంట్షాక్తో చనిపోయాడని కలెక్టర్ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నల్గొండ నవోదయ ప్రిన్సిపాల్నాగభూషణం బాధ్యతలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా రీజియన్అసిస్టెంట్కమిషనర్ అభిజిత్బేరా పాలేరులోని స్కూలును సందర్శించారు.
ఘటనా స్థలాన్ని కరెంట్బోర్డును, తీగలను ఆయన పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నాగేందర్ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మృతుడి తండ్రి ఫిర్యాదుతో నవోదయ ప్రిన్సిపాల్ చంద్రబాబు, పీఈటీ వేణుగోపాల్, ఆర్ట్ టీచర్ వీరస్వామిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.