
సిద్దిపేట: జిల్లా వ్యవసాయ అధికారి( డీఏవో)పై సస్పెన్షన్ వేటు పడింది.ఈ ఏమేరకు డీఏవో శివ ప్రసాద్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ ఉద్యోగి పట్ల డీఏవో అనుచితంగా ప్రవర్తించాడని కలెక్టర్కు ఫిర్యాదు అందింది. దీనిపై కలెక్టర్ విచారణ జరిపించారు. అధికారులు సమర్పించిన నివేదికను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు కలెక్టర్ పంపారు. నివేదిక ఆధారంగా డీఏవోను వ్యవసాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు.
Also read :బీఆర్ఎస్ ఓటమితో సమాచారం ధ్వంసం: ప్రణీతరావు వాంగ్మూలం