ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు.. హత్య ఆస్పత్రిలో అనుమానాస్పద బ్యాగ్

ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు.. హత్య ఆస్పత్రిలో అనుమానాస్పద బ్యాగ్

ఆర్‌జి కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హ‌త్యాచార ఘ‌ట‌న‌ను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. విధులకు హాజరవ్వాలని దేశ అత్యన్నత న్యాయస్థానం హెచ్చరించినప్పటికీ, వారు వెనక్కి తగ్గలేదు. ఒకవైపు ఇది జరుగుతుంటే.. జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్న ఆసుపత్రి ప్రాంగణంలో అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. బ్యాగును కనుగొన్న డాక్టర్లు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ALSO READ | ట్రైనీ ఆర్మీ అధికారులను దోచుకుని..స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్

సమాచారం అందుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.  స్నిఫర్ డాగ్స్‌ సాయంతో అనుమానాస్పద బ్యాగ్ ను తనిఖీ చేస్తున్నారు. ముందుస్తుగా ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరూ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాగులో బాంబ్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదని, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బ్యాగ్‌ని పరిశీలిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మృత‌దేహాల‌తో శృంగారం

మరోవైపు, ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిగా ఉన్న సంజ‌య్ రాయ్ ఆసుపత్రి మార్చురీ యార్డులో ఉన్న మృత‌దేహాల‌తో శృంగారం చేసిన‌ట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందుకు సంబంధించిన వీడియోల‌ను అత‌ని ఫోన్‌లో గుర్తించారు. దీనిపై విచార‌ణ జరుగుతోంది. అదే ఫోన్ లో బాధితురాలి మృత‌దేహంతోనూ శృంగారం చేసిన ఫోటోను పోలీసులు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.