ఫిలిప్పీన్స్​లో మెడికో అనుమానాస్పద మృతి

ఫిలిప్పీన్స్​లో మెడికో అనుమానాస్పద మృతి
  • సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో విషాదం
  • బాడీని తెప్పించాలని తండ్రి వేడుకోలు

పటాన్​చెరు, వెలుగు: ఫిలిప్పీన్స్​లో ఎంబీబీఎస్​ మూడో సంవత్సరం చదువుతున్న  సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ద(20) అనుమానాస్పదంగా చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. మెదక్​ జిల్లాలో విద్యుత్​ శాఖలో పని చేస్తున్న చింత అమృత్​రావు పటాన్​చెరు మండలం ఇంద్రేశంలో ఉంటున్నారు.

కూతురు స్నిగ్దను ఎంబీబీఎస్​ చదివించేందుకు 2021లో  పిలిప్పీన్స్​ దేశం మనీలాలోని ఫర్​ ఫెక్చువల్​ హెల్త్  యూనివర్సిటీలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. గత ఏడాది మార్చిలో ఇంటికి వచ్చి ఏప్రిల్​లో తిరిగి వెళ్లింది. కాగా, ఈ నెల 15న తన పుట్టిన రోజు సందర్భంగా విషెస్​ చెప్పేందుకు పేరెంట్స్​ ఫోన్​ చేయగా ఆమె ఎత్తలేదు. ఆ తరువాత ఆమె స్నేహితులు ఫోన్​ చేసి స్నిగ్ద చనిపోయిందని తెలిపారు.

బర్త్​డే విషెస్​ చెప్పేందుకు తన రూమ్​కు వెళ్లగా, డోర్​ తీయలేదని, డోర్​ బద్దలు కొట్టి చూడగా అనుమానాస్పందంగా పడిఉందని తెలిపారు. అక్కడి వారి సాయంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వారు చెప్పారని తండ్రి అమృత్​రావు వాపోయారు. తమ కూతురు ధైర్యవంతురాలని, ఆమె మరణంపై విచారణ జరపించాలని కోరారు. బాడీని త్వరగా అప్పజెప్పేందుకు ఇండియన్​ ఎంబసీ చర్యలు తీసుకోవాలన్నారు.