సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. పెన్ పహాడ్ మండలం దోసపాడు బిసి గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థిని సరస్వతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నూతనకల్ మండలం మాచన పల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య దంపతుల కూతురు సరస్వతి(10) బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది. ఇవాళ ఉదయం తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించామని ఆ లోపే చనిపోయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు.
Also Read:నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. యువజంట ఆత్మహత్య
మరో వైపు జ్వరం వచ్చిందని ఇవాళ ఉదయం ఏడు గంటలకు తమకు సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు చెప్పారు. అయితే హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం విద్యార్థిని మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.