ఢిల్లీలో అనుమానాస్పద ఎలక్ట్రికల్ డివైజ్

ఢిల్లీలో అనుమానాస్పద ఎలక్ట్రికల్ డివైజ్

మూడు రోజుల క్రితం ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ గోడ పేలుడు కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. బ్లాస్ట్ వెనుక ఎవరు ఉన్నారని ఆరాదీస్తున్నారు. ఢిల్లీ పాలికా బజార్‌లో ఓ షాప్ లో అనుమానాస్పద ఎలక్ట్రికల్ డివైజ్ కనుగొన్నారు పోలీసులు. అది మొబైల్ నెట్ వర్క్ జామర్ లా పని చేస్తోంది. దాని గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఢిల్లీ పోలీసులు అక్టోబర్ 27న తనిఖీల్లో భాగంగా ఓ షాప్  నుంచి అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మొబైల్ ఫోన్ నెట్ వర్క్ హ్యాక్ చేసే డివైజ్ కనిపించడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ని CRPF పాఠశాల సమీపంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. పేలుడు తరువాత అధికారులు సంఘటన స్థలం నుంచి తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నివేదించారు. వైట్ పౌడర్ శాంపిల్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్, ఎన్‌ఎస్‌జి బృందాలు సేకరించాయి.