ప్లాస్టిక్ లెస్ సిటీకోసం.. రాంకీతో మారికో

ప్లాస్టిక్ లెస్ సిటీకోసం.. రాంకీతో మారికో

హైదరాబాద్, వెలుగు: ప్లాస్టిక్ నిర్వహణకు  సస్టెయినబిలిటీ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ని అందిస్తున్న రీ సస్టెయినబిలిటీ, హర్ష్ మారివాలా కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫీస్ షార్ప్ వెంచర్స్  హైదరాబాద్​లో ప్లాస్టిక్​ వ్యర్థాల రీసైక్లింగ్​కోసం చేతులు కలిపాయి. 

ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పూర్​లోనూ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాయి. ఇందుకోసం జాయింట్​వెంచర్​ ఏర్పాటు చేశారు.  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐసీజీ పరిశ్రమకు అత్యంత నాణ్యమైన రీసైకిల్డ్ పాలీఓలిఫిన్స్ (పాలియోల్ఫిన్స్) సరఫరాను పెంచడం, ప్లాస్టిక్​ వ్యర్థాలను తొలగించడానికే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని రెండు కంపెనీలు ప్రకటించాయి.

Also Read:-మ్యూచువల్​ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు

 ఏటా 32 వేల టన్నుల వ్యర్థాలను రీసైకిల్​ చేస్తామని, ఫలితంగా వార్షికంగా 15 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని  రీ సస్టెయినబిలిటీ తెలిపింది.  ఏటా 9,000 టన్నుల పైగా అత్యధిక రీసైకిల్డ్​ పాలీమర్స్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. తిరిగి వీటిని ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీజీ,  
ఇతరత్రా అవసరాలకు వాడుతారు.