నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీ 2023–24 నాలుగో ఎడిషన్‌లో తెలంగాణ రాష్ట్రం 74 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది. 2020–21లోనూ 69 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది. 2017–18లో 9 (61 మార్కులు), 2019–20లో 5 (67 మార్కులు), 2020–21లో 11వ(69 మార్కులు) స్థానంలో ఉంది. 2023–24కుగాను 79 మార్కులతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో నిలిచింది.
- తెలంగాణ లింగ సమానత్వంలో అత్యంత వెనుకబడి ఉంది. జీరో హంగర్, నాణ్యమైన విద్య, వాతావరణ పరిరక్షణ, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లోనూ ఎల్లో జోన్లో ఉంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నిరు అందిస్తున్నా ఆ విషయంలో 90 మార్కులతో 14 స్థానానికే పరిమితమైంది. నాణ్యమైన విద్యుత్తు అందించడంలో మాత్రం 100 శాతం మార్కులు సాధించింది.
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన 1. పేదరికాన్ని నిర్మూలించడం 8. ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిని సాధించడం, 13. వాతావరణ మార్పులపై చర్యలు 15. భూమిపై జీవజాతులను రక్షించడం తదితర లక్ష్యాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొంది.
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, స్వచ్ఛ భారత్, జన్‌ధన్; ఆయుష్మాన్ భారత్ – పీఎంజేఏవై, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, పీఎం ముద్ర యోజన, సౌభాగ్య, స్టార్ట్ అప్ ఇండియా మొదలైన ప్రభుత్వ కార్యక్రమాలు వేగవంతమైన అభివృద్ధికి దోహదపడ్డాయి.
- మొత్తం స్కోర్ లో అన్ని రాష్ట్రాలు మెరుగుపడ్డాయి.
- 2018లో 57 మార్కులతో ఉన్న భారత్ 2019–20లో 60, 2020–21లో 66, 2023–24లో 71 మార్కులు సాధించి భారత్ పనితీరును మెరుగుపరుచుకుంది.
- సుస్థిరాభివృద్ధి 13వ లక్ష్యం (క్లైమేట్ యాక్షన్) 2020–21లో 54 నుంచి 2023–24లో 67కి అత్యధిక స్కోర్‌ను సాధించింది. 1వ లక్ష్యం (పేదరిక నిర్మూలన) 60 నుంచి 72కి మెరుగుపడింది.
- ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 రాష్ట్రాలు కొత్తగా చేరాయి. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మణిపూర్, ఒడిశా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ.
- ALSO READ : కనీస మద్దతు ధర అంటే ఏంటి.? వ్యవసాయ ధరల కమిషన్ విధులు