సస్టయినబుల్ డెవలప్‌‌మెంట్‌..టాప్‌‌5లో తెలంగాణ

హైదరాబాద్‌‌, వెలుగు: సస్టయిన్ డెవలప్‌‌మెంట్‌‌లో  తెలంగాణ రాష్ట్రం దేశంలో ఐదో స్థానంలో ఉందని, 980 ఐజీబీసీ ప్రాజెక్ట్‌‌లతో దూసుకుపోతోందని ఇండియా గ్రీన్‌‌ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నేషనల్ వైస్ చైర్మన్ వీ శేఖర్ రెడ్డి అన్నారు. ఈసీబీసీ రూల్స్‌‌ తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

సంస్థ నిర్వహించిన లీడర్‌‌‌‌షిప్ డైలాగ్‌‌లో శనివారం ఆయన మాట్లాడారు. సస్టయినబుల్ డెవలప్‌‌మెంట్‌‌పై ఈ ఈవెంట్‌‌లో చర్చించారు. కాగా, పర్యావరణానికి హాని చేయకుండా ఉండే బిల్డింగ్‌‌ల నిర్మాణాన్ని ఐజీబీసీ ప్రోత్సహిస్తోంది.