నిండా ముంచేశారు : మూడేళ్లు అయినా బై బ్యాక్ డబ్బులు ఇవ్వని సువర్ణ భూమి, ఆర్ జే హోమ్స్

నిండా ముంచేశారు : మూడేళ్లు అయినా బై బ్యాక్ డబ్బులు ఇవ్వని సువర్ణ భూమి, ఆర్ జే హోమ్స్

మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకొని కొన్ని రియల్​ ఎస్టేట్​ సంస్థలు ప్రీ లాంచ్​లు, బై బ్యాక్​ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ.. అందినకాడికి కొల్లగొడ్తున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో, సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి.. చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి.  హైదరాబాద్​ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. 

నాలుగేండ్లయినా ఇండ్లు కట్టియలే!

ప్రీ లాంచింగ్​ పేరుతో ఆర్‌‌‌‌‌‌‌‌జే గ్రూప్ అనే సంస్థ సుమారు 600 మందిని ముంచింది. వారి నుంచి దాదాపు రూ.150 కోట్లను వ‌‌‌‌‌‌‌‌సూలు చేసింది. నారాయణ్ ఖేడ్, ఘట్‌‌‌‌‌‌‌‌కేస‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌, పఠాన్ చెరు, క‌‌‌‌‌‌‌‌ర్దనూరు వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట వెంచ‌‌‌‌‌‌‌‌ర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేసింది.  ప్రముఖుల‌‌‌‌‌‌‌‌తో ప్రక‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల్ని కూడా చేయించింది. 2022 నుంచి ఈ సంస్థలో ఒక్కొక్కరు రూ.20 లక్షల నుంచి 50 ల‌‌‌‌‌‌‌‌క్షలు పెట్టుబ‌‌‌‌‌‌‌‌డి పెట్టామ‌‌‌‌‌‌‌‌ని.. నాలుగేండ్లు గ‌‌‌‌‌‌‌‌డుస్తున్నా ఇప్పటికీ నిర్మాణం చేప‌‌‌‌‌‌‌‌ట్టలేదని బాధితులు రోడ్డెక్కారు. ఆర్‌‌‌‌‌‌‌‌జే గ్రూప్ ఎండీని గట్టిగా నిల‌‌‌‌‌‌‌‌దీస్తే చెక్కులు ఇచ్చారని.. కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయ‌‌‌‌‌‌‌‌ని ఆవేద‌‌‌‌‌‌‌‌న వ్యక్తం చేశారు.

మూడేండ్లయినా బై బ్యాక్​ రాలే!

బై బ్యాక్ స్కీమ్ పేరుతో ప్లాట్లలో పెట్టుబడి పెడితే మూడేండ్ల త‌‌‌‌‌‌‌‌ర్వాత మ‌‌‌‌‌‌‌‌ళ్లీతామే కొంటామ‌‌‌‌‌‌‌‌ని సువ‌‌‌‌‌‌‌‌ర్ణ భూమి సంస్థ చెప్పింది. లే ఔట్లను అభివృద్ధి చేసే సంస్థలో సువ‌‌‌‌‌‌‌‌ర్ణభూమికి ప్రత్యేక పేరు ఉంది. ఈ సంస్థ పెద్ద పెద్ద సినీ స్టార్స్​తో  బ్రాండింగ్ చేయిస్తూ.. ప్లాట్ల కొనుగోలుదారుల‌‌‌‌‌‌‌‌కు ద‌‌‌‌‌‌‌‌గ్గరైంది. ‘త‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌కు చెర‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ని చిరునామా’ అంటూ బ‌‌‌‌‌‌‌‌య్యర్లను విశేషంగా ఆక‌‌‌‌‌‌‌‌ర్షించింది.అయితే, ఈ కంపెనీ కూడా ఇప్పుడు మోస‌‌‌‌‌‌‌‌పూరిత సంస్థల జాబితాలో చేరింది. బై బ్యాక్ స్కీముతో త‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ను మోసం చేశారంటూ కొంద‌‌‌‌‌‌‌‌రు బ‌‌‌‌‌‌‌‌య్యర్లు పోలీస్​స్టేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌లో కేసు పెట్టారు. మూడేండ్ల కింద తాము పెట్టుబ‌‌‌‌‌‌‌‌డి పెట్టామ‌‌‌‌‌‌‌‌ని.. కానీ, ఇంత‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కూ  సొమ్ము ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేద‌‌‌‌‌‌‌‌న వ్యక్తం చేశారు. వ‌‌‌‌‌‌‌‌డ్డీ వ‌‌‌‌‌‌‌‌ద్దు, క‌‌‌‌‌‌‌‌నీసం అస‌‌‌‌‌‌‌‌లిచ్చినా చాల‌‌‌‌‌‌‌‌ని వేడుకుంటున్నారు. అయితే, తాము ఎలాంటి మోసం చేయ‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌ని.. బ‌‌‌‌‌‌‌‌య్యర్లకు ప్లాట్లను రాసిచ్చామ‌‌‌‌‌‌‌‌ని.. వాటిని అమ్ముదామంటే మార్కెట్ ప్రతికూలంగా ఉంద‌‌‌‌‌‌‌‌ని సంస్థ ఎండీ శ్రీధ‌‌‌‌‌‌‌‌ర్​ ఒక వీడియోలో చెప్పారు. పైగా.. స్థలాన్ని రిజిస్టర్ చేశామ‌‌‌‌‌‌‌‌ని, ఎంవోయూ కుదుర్చుకున్నామ‌‌‌‌‌‌‌‌ని సంస్థ ఎండీ శ్రీధ‌‌‌‌‌‌‌‌ర్  చెప్పడం.. రెరా నిబంధనలకు విరుద్ధమని, దీంతో ఆయనే త‌‌‌‌‌‌‌‌ప్పును ఒప్పుకున్నట్లయిందనిరెరా అధికారులు అంటున్నారు.