ఇటీవల వెలుగులోకి వచ్చిన సువర్ణభూమి స్కాంలో బాధితులు బంజారాహిల్స్ లోని సువర్ణభూమి ఆఫీసు దగ్గర ఆందోళన చేపట్టారు. బై బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి దగ్గర రూ. 30 లక్షల నుంచి కోటి రూపాయల వసూలు చేశారని, ఏడాదిన్నర తరువాత ఇన్వెస్ట్మెంట్పై అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి ఆఫీసుకు రమ్మని పిలిచి బాధితులని బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ.. దురుసుగా మాట్లాడుతున్నారని తెలిపారు బాధితులు.
స్కీం కాలపరిమితి దాటినప్పటికీ తమ డబ్బులు చెల్లించకుండా ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డబ్బులు కోసం ఆఫీస్కు వెళితే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని.. మహిళా బాధితులు వాపోయారు. మూడేళ్లు అయినప్పటికీ చెల్లని చెక్కులు ఇచ్చి తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపారు.
ALSO READ | రైతు సదస్సును మూడు రోజులు నిర్వహించండి : సీఎం రేవంత్
ప్రముఖ హీరోలతో సంస్థ పేరును ప్రమోట్ చేయడం వల్ల నమ్మి మోస పోయామయమని బాధితులు వాపోతున్నారు. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్, దీప్తిలపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితులు కోరుతున్నారు.