సువెన్ ​ఫార్మా లాభం 78 శాతం జంప్​

సువెన్ ​ఫార్మా లాభం 78 శాతం జంప్​

హైదరాబాద్​, వెలుగు: సువెన్​ ఫార్మా గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​ఫలితాలను ప్రకటించింది. కంపెనీకి ఈసారి రూ.83.3 కోట్ల నికరలాభం వచ్చింది. అంతకుముందు సంవత్సరంలో మూడో క్వార్టర్​ లాభం రూ.46.8 కోట్లతో పోలిస్తే ఇది 78 శాతం ఎక్కువ. 

రెవెన్యూ 40 శాతం పెరిగి రూ.307.72 కోట్లకు చేరుకుంది. సీడీఎంఓ బిజినెస్ రెట్టింపు కావడంతో ఇది దూసుకెళ్లింది. గ్రాస్​ మార్జిన్లు 71.5 శాతం కాగా, అడ్జస్టెడ్​ఇబిటా మార్జిన్లు 38.7 శాతంగా ఉన్నాయి.