OTT Thriller Web Series: ఐశ్వర్య రాజేశ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వ‌చ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

OTT Thriller Web Series: ఐశ్వర్య రాజేశ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వ‌చ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొన్ని వెబ్ సిరీస్ లు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. పదేసి ఎపిసోడ్స్ ఉన్న కథలో దమ్ముంటే చూస్తూనే ఉంటాం. అది కంప్లీట్ అయ్యే కొద్దీ మనలో ఏదో తెలియని థ్రిల్ మూమెంట్ వచ్చేస్తోంది. ఇంకొన్ని సార్లు ఆ వెబ్ సిరీస్ కంప్లీట్ అయిందంటే.. ఏదో తెలియని వెలితి కూడా మనలో ఉంటుంది. 

అందులోను క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చే సినిమాలైతే చెప్పనక్కర్లేదు. ఇపుడాలాంటీ ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్కి సిద్ధమైంది. అదే సుడల్‌: ది వొర్టెక్స్‌(Suzhal The Vortex). వాల్ వాచర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై గాయత్రి పుష్కర్‌ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌లో ఐశ్వర్య రాజేశ్, గోపిక రమేష్, కథిర్, ఆర్. పార్థిబన్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా బ్రహ్మ జి, అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు.

2022లో విడుదలైన తమిళ వెబ్‌సిరీస్‌ ఇది. తెలుగులో డబ్ అయి గ్రాండ్ సక్సెస్ అయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్‌ దర్శకుడు రాజ‌మౌళి, హృతిక్‌రోష‌న్‌, ధ‌నుష్‌తో పాటు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల్ని అందుకుంది. 

Also Read :- హాస్పిటల్ బెడ్పై యాంకర్‌ రష్మీ.. ఆందోళనలో ఫ్యాన్స్

లేటెస్ట్గా (Feb11) సుడ‌ల్ వెబ్‌సిరీస్‌కు కొన‌సాగింపుగా సీజ‌న్ 2 వ‌స్తోందని ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సుడ‌ల్ 2పై క్రియేట‌ర్స్ పుష్క‌ర్‌, గాయ‌త్రి అఫీషియ‌ల్‌గా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

"కొన్ని తుఫానులు ఎప్పటికీ ఆగవు.. సుడ‌ల్ సీజన్ 2 ఫిబ్రవరి 28నుంచి స్ట్రీమింగ్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ సీజన్ 2 స్టోరీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం సమాజంలోని ఓ సీరియ‌స్ ఇష్యూను తీసుకొని స్ట్రాంగ్ పాయింట్‌తో సీజ‌న్ 2ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు తెలిపారు. సీక్వెల్ క‌థ కోసం దాదాపు ఐదారు నెల‌లుగా చాలా రీసెర్చ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.