న్యూఢిల్లీ: రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పేరొందిన సుజ్లాన్ గ్రూప్ ఛైర్మన్ తుల్సి తంతి శనివారం సాయంత్రం కన్నుమూశారు. తమ ఛైర్మన్ గుండె పోటుతో కన్నుమూసినట్లు సుజ్లాన్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. విండ్ ఎనర్జీ బిజినెస్‌లో ఈ గ్రూప్ దూసుకెళ్లేలా ఆయన వ్యవహరించారు. క్లీన్ ఎనర్జీ రంగం ఎదుగుతుందని ముందుగానే ఊహించిన తంతి 1995లోనే ఆ దిశలో చొరవ తీసుకున్నారు.
అంతేకాదు, ఇండియాలో ఫాదర్ ఆఫ్ విండ్ ఎనర్జీగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నాయకత్వంలోనే సుజ్లాన్ గ్రూప్ 19.4 గిగావాట్ల కెపాసిటీతో దేశంలోనే పెద్దదిగా ఎదిగింది. ఇండియాలో విండ్ ఎనర్జీ సెగ్మెంట్లో 33 శాతం వాటా దక్కించుకున్న ఈ గ్రూప్ గ్లోబల్‌గా 17 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూఎస్‌లో 2 గిగావాట్ల విండ్ ఎనర్జీని ఈ గ్రూప్ ప్రొడ్యూస్ చేస్తోంది. విండ్ ఎనర్జీలోకి రావడానికి ముందు టెక్స్టైల్ బిజినెస్‌ను తుల్సి తంతి నడిపేవారు. తుల్సి తంతి మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సంతాపం వ్యక్తం చేశారు.