Suzlon Stock: కుప్పకూలిన సుజ్లాన్ స్టాక్.. ఉంచుకోవాలా? అమ్మాలా? నిపుణుల మాట ఇదే..

Suzlon Stock: కుప్పకూలిన సుజ్లాన్ స్టాక్.. ఉంచుకోవాలా? అమ్మాలా? నిపుణుల మాట ఇదే..

Suzlon Energy Shares: దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం కొనసాగుతున్న వేళ ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ భారీగా దెబ్బతింది. దీంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు కనిష్ఠాలను తాకాయి. ఈ ఏడాది ప్రారంభంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెరుగుతున్న ఆర్డర్లతో సుజ్లాన్ షేర్లు మంచి బుల్ ర్యాలీని చూసిన సంగతి తెలిసిందే. 

నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 17 శాతం తగ్గి ఒక్కోటి రూ.46 స్థాయిలకు చేరుకుంది. వరుసగా రెండు రోజుల నుంచి కంపెనీ షేర్లు క్షీణతను చూస్తూనే ఉన్నాయి. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు స్టాక్ 22 శాతానికి పైగా పడిపోగా.. ఆరు నెలల కాలంలో ఇన్వెస్టర్లకు 30 శాతం నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే మార్కెట్ల సెంటిమెంట్లతో పాటు స్టాక్ ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న మరో వార్త కూడా ఇక్కడ ఉంది. అదేంటంటే.. కంపెనీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ సుజ్లాన్ గ్లోబల్ సర్వీసెస్ కస్టమ్స్ సుంకాలు చెల్లించలేదంటూ ముంబై కస్టమ్స్ దిగుమతి కమిషన్ జరిమానా విధించబడినట్లు వెల్లడికావటమే. సుజ్లాన్ కంపెనీకి రూ.7.47 లక్షల మేర జరిమానా విధించబడినట్లు వెల్లడైంది. కంపెనీ మాత్రం దీనిపై అప్పీల్ చేస్తున్నట్లు వెల్లడించింది. 

వాస్తవానికి ఈ జరిమానా కంపెనీ చైనా నుంచి 2017 ఆగస్టులో దిగుమతి చేసుకున్న కొన్ని విడిభాగాలకు చెందిన ఆర్డర్ కి సంబంధించినదిగా కంపెనీ పేర్కొంది. అయితే మధ్యాహ్నం సమయం 3.07 గంటల నాటికి నష్టాల నుంచి కంపెనీ తేరుకోవటంతో 6.20 శాతం నష్టంతో ఒక్కో షేరు రూ.51.90 రేటు వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది.  

Also Read:-వామ్మో.. ట్రంప్ అధికారంలోకి వచ్చాక రూ.50 లక్షల కోట్లు లాసైన భారతీయ ఇన్వెస్టర్స్..!

బ్రోకరేజీల మాట ఏంటి..?
మార్కెట్లు భారీగా పతనాన్ని కొనసాగిస్తున్న వేల చాలా మంది పెట్టుబడిదారులు సుజ్లాన్ ఎనర్జీ షేర్లను కొనాలా లేక అమ్మాలా అనే డైలమాలో ఉన్నారు. అలాగే చాలా మంది ప్రస్తుతం తగ్గిన ధరల వద్ద అక్యూమిలేట్ చేసుకుని యావరేజ్ చేయెుచ్చా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే కరెక్షన్ తర్వాత స్టాక్ తిరిగి పుంజుకుంటుందనే ఆశాజనకంగా ఉన్నారు. అయితే బ్రోకరేజ్ సంస్థలు సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లపై ఏమంటున్నాయనే విషయాన్ని ఇన్వెస్టర్లు పరిశీలించాల్సిందే. 

- సుజ్లాన్ ఎనర్జీపై మోర్గాన్ స్టాన్లీ "ఓవర్ వెయిట్" రేటింగ్‌ను రూ. 71 టార్గెట్ ధరతో కొనసాగించింది

- దేశీయ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ సుజ్లాన్ షేర్లకు "BUY" రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.70 వద్ద కొనసాగిస్తోంది

- ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్‌లపై బుల్లిష్‌గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ తన టార్గెట్ ధరను గతంలో ప్రకటించిన రూ.50 నుంచి రూ.60కి పెంచుతూ BUY  రేటింగ్ అందిస్తోంది.

- జేఎం ఫైనాన్షియల్ సుజ్లాన్ ఎనర్జీపై "BUY" రేటింగ్‌ను రూ. 71 టార్గెట్ ధరతో కొనసాగించింది

- జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సుజ్లాన్ ఎనర్జీ స్టాక్‌కు రూ. 71 టార్గెట్ ధరతో "BUY" రేటింగ్ సిఫార్సు చేసింది

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.