న్యూఢిల్లీ: ఇగ్నిషన్‌లో సమస్యలు ఉన్నాయనే అనుమానంతో సుమారు నాలుగు లక్షల టూవీలర్లను సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియాలో రీకాల్ చేస్తోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, 2,63,788 యాక్సెస్ 125 బండ్లను, 52,578 అవెనిస్ 125 బండ్లను, 72,045 బర్గమన్ స్ట్రీట్ బండ్లను సుజుకీ రీకాల్ చేస్తోంది.
ఈ బండ్లు ఏప్రిల్ 30,2022, డిసెంబర్ 3, 2022 మధ్య తయారయ్యాయి. ఈ వెహికల్స్ ఓనర్లను కంపెనీ సంప్రదిస్తోంది. సమస్య ఉన్న పార్టులను దగ్గరలోని సర్వీస్ సెంటర్లలో ఫ్రీగా రిప్లేస్ చేస్తారు.