ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల జోరు నడుస్తుంటే.. మారుతి ఇంకా సంప్రదాయ ఇంధనంపై ఆధారపడిన కార్లనే విడుదల చేస్తుందేంటి అనుకునేవారికి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసింది మారుతీ సుజుకీ. అందులో భాగంగా ఈ మధ్యనే ఫస్ట్ మోడల్ ఎలక్ట్రిక్ కార్ ‘ఇ-విటార’ (e-Vitara) మోడల్ ని ఆవిష్కరించింది. కొత్త ఏడాదిలో గుజరాత్ లో ప్రొడక్షన్ ప్రారంభిస్తున్నట్లు సుజుకీ మోటర్ కార్పొరేషన్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ తెలిపారు.
యూరప్, ఇండియా, జపాన్ తదితర దేశాలలో 2025 సమ్మర్ లో సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ మాస్ ప్రొడక్షన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఇ విటార ఎలక్ట్రిక్ కార్ జనవరి, 2023 ఆటో ఎక్స్ పో సందర్భంగా రివీల్ చేసిన ఈవీఎక్స్(Evx) కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా వస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ తెలిపారు. అది ప్రపంచ వ్యాప్తంగా వ్యూహాత్మకంగా రిలీజ్ చేస్తున్న మోడల్స్ లో ఫస్ట్ మోడల్ అని కంపెనీ అంటోంది.
Also Read :- జనవరి 2025లో బ్యాంక్ హాలీడేస్.. ఆ తేదీల్లో బ్యాంకులు బంద్
రిపీటెడ్ గా ట్రయల్స్ చేసి, ఎప్పటి కప్పుడు వచ్చే ఎర్రర్స్ ను రెక్టిఫై చేసి తెచ్చిన మోడల్ ఈ విటార అని కంపెనీ చెబుతోంది. కార్బన్ ఉద్గారాలు తగ్గించే లక్ష్యంలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ తో పాటు.. హైబ్రిడ్ మోడల్స్, సీఎన్జీ వెహికిల్స్ .. ఇలా అన్ని టెక్నాలజీలతో ప్రపంచ వ్యాప్తంగా త్వరలోనే వెహికిల్స్ ను తీసుకొస్తామని ప్రకటించారు.
ఇంకేముంది.. తక్కువ బడ్జెట్ లో మధ్యతరగతికి అనుకూల ప్రైస్ లో ఉండే మారుతీ సుజుకీ.. ఇప్పటికైనా ఎలక్ట్రిక్ వెహికిల్ ను తీసుకురావడం బడ్జెట్ కార్ల కోసం చూసే వారికి శుభవార్త అనే చెప్పాలి.