న్యూఢిల్లీ: మారుతి సుజుకీ పేరెంట్ కంపెనీ సుజుకీ మోటార్స్ ఇండియా తమ మొదటి ఎలక్ట్రిక్ కారును యూరప్‌లో లాంచ్ చేసింది. ఈవిటారా పేరుతో ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. మారుతి సుజుకీ వచ్చే ఏడాది ఇండియాలో ఈ మోడల్‌ను లాంచ్ చేయనుంది.
గుజరాత్‌లోని సుజుకీ మోటార్ ప్లాంట్‌లో ఈవిటారాను తయారు చేయనున్నారు. ఈ కారు సేల్స్ యూరప్, ఇండియా, జపాన్‌తో సహా వివిధ దేశాల్లో వచ్చే ఏడాది వేసవిలో మొదలవుతాయి.