హైదరాబాద్, వెలుగు: ఈ నెల 5 నుంచి 9 వరకు గ్రేటర్పరిధిలో ‘స్వచ్ఛదనం-– పచ్చదనం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట తెలిపారు. ప్రతిఒక్కరూ పాల్గొని సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తలపెట్టిందన్నారు.
సిటీలోని అన్ని డివిజన్లలో సమర్థంగా నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి టీమ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఒక్కో రోజు ఒక్కో వినూత్న కార్యక్రమాన్ని నిర్దేశించిన నేపథ్యంలో, ఆయా రోజుల్లో సాయంత్రం 4 గంటల లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.