పాల్వంచలో స్వచ్ఛ ఆటోల అడ్డగింత

పాల్వంచలో స్వచ్ఛ ఆటోల అడ్డగింత

పాల్వంచ, వెలుగు: చెత్త తరలించే వాహనాలు తమ వీధుల నుంచి వెళ్లడంతో దుర్గంధం వ్యాపిస్తోందని స్వచ్ఛ ఆటోలను పాత పాల్వంచ గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. మొర్రేడు వాగు సమీపంలోని ఖాళీ ప్రదేశానికి మున్సిపాలిటీకి చెందిన చెత్తను తమ గ్రామం గుండా తీసుకెళ్లొద్దని డిమాండ్​ చేశారు. దుర్గంధంతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు.

విషయం తెలుసుకున్న డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామిని పిలిపించి సమస్యను వివరించారు. వారం రోజుల్లో చెత్త తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని మున్సిపల్ కమీషనర్ చెప్పడంతో..  స్వచ్ఛ ఆటోలను గ్రామస్తులు వదిలివేశారు.