ప్రజారోగ్యానికి గేమ్ చేంజర్‎గా స్వచ్ఛభారత్: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజారోగ్యానికి గేమ్ చేంజర్‎గా మారిందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న పిల్లలు రోగాల బారిన పడకుండా ఉండటంలో, వాళ్ల మరణాలు తగ్గించడంలో మరుగుదొడ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘మరుగుదొడ్ల నిర్మాణం–భారత్లో శిశుమరణాలు’ అంశంపై నేచర్ సైంటిఫిక్ జర్నల్లో వచ్చిన ఆర్టికల్ను షేర్ చేశారు. ‘‘2014లో స్వచ్ఛ భారత్ ప్రారంభం తర్వాత టాయిలెట్ల నిర్మాణం పెరగడంతో పిల్లలు రోగాల బారిన పడటం తగ్గింది. గతంతో పోలిస్తే ఏటా 60 వేల నుంచి 70 వేల మరణాలు తగ్గించడంలో మరుగుదొడ్లు కీలక పాత్ర పోషించాయి” అని ఆ రీసెర్చ్ ఆర్టికల్ లో పేర్కొన్నారు.