వేతనాలు చెల్లించండి..స్వచ్ఛ భారత్ గ్రామీణ ఉద్యోగుల డిమాండ్

వేతనాలు చెల్లించండి..స్వచ్ఛ భారత్ గ్రామీణ ఉద్యోగుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: తమకు గత ఐదు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదని స్వచ్ఛ భారత్ గ్రామీణ ఉద్యోగులు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత మెరుగుదల, బహిరంగ మలవిసర్జన నిషేధం అమలులో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 64 మందికి కొన్ని నెలలుగా జీతాలు రాకపోవడంతో తాము దుర్భర జీవితాలు అనుభవిస్తున్నామని చెప్పారు.