
శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా హసిత్ గోలి రూపొందించిన చిత్రం ‘శ్వాగ్’. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం మూడో పాటను రిలీజ్ చేశారు. ‘ఇంగ్లాండ్ రాణి.. విల్లందుకోనీ.. సోదాలు సేసేనే..’ అంటూ వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటలో రీతూ వర్మ క్యారెక్టర్‌ను ఇంటరెస్టింగ్‌గా ప్రెజెంట్ చేశారు.
‘కయ్యాల నారీ.. ఆ మీసగాల్ని కారంగా సూసేనే..’ అని స్వరూప్ గోలి క్యాచీ లిరిక్స్ రాయగా, కైలాష్ ఖేర్ తన ఎనర్జిటిక్ వోకల్స్‌తో ఆకట్టుకున్నాడు. దక్ష నగార్కర్ మరో హీరోయిన్‌గా నటించగా, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదల కానుంది.