వేసవి శిబిరాలతో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ.. స్వామి బోధమయానంద

వేసవి శిబిరాలతో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ.. స్వామి బోధమయానంద

హైదరాబాద్:వేసవి శిబిరాల ద్వారా విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నామని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా 20 లక్షల మందికి పైగా విద్యార్థులను తీర్చిదిద్దామని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో సంస్కార్ వేసవి శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

విద్యార్థులు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. రామకృష్ణ మఠం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు, యువకులు జాతి నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని స్వామి బోధమయానంద చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరైన కిమ్స్ హాస్పిటల్ సిఎండి భాస్కరరావు మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణకు గల ప్రాధాన్యతను వివరించారు. 

►ALSO READ | తెలంగాణ ఇచ్చిన సోనియా కాళ్లు మొక్కిన విషయం మరిచావా కేసీఆర్..మంత్రి పొంగులేటి

పిల్లలు తల్లిదండ్రుల నుంచి విలువలు నేర్చుకుంటారని చెప్పారు. విద్య ద్వారా జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవచ్చోఆయన వివరించారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం వాలంటీర్లు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.