ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు బిగ్ షాక్ తగిలింది. హిందూపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుండి టికెట్ ఆశించిన ఆయన ఆ పార్టీ నుండి టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు.
గత రెండు ఎన్నికల్లో హిందూపురం నుండి పోటీ చేసి గెలుపొందిన బాలకృష్ణ, ఈసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలకృష్ణ గెలుపు సునాయాసమే అనుకున్నప్పటికీ సీన్లోకి పరిపూర్ణానంద ఎంట్రీ ఇవ్వటంతో కూటమి ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది. మరి, స్వామిజీ ఎంట్రీ హిందూపురం ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.