అయ్యప్ప మకర జ్యోతి వెనుక రహస్యం... ఇదే...

అయ్యప్ప మకర జ్యోతి వెనుక  రహస్యం... ఇదే...

శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది.  శబరిమలై ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మకర జ్యోతి. మకర సంక్రాంతి నాడే అయ్యప్ప జ్యోతిని చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఈ మకర జ్యోతి అయ్యప్ప స్వరూపమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.అయితే అది మూఢనమ్మకమని భక్తులను మోసం చేసేదానికి మనుషులే చేసేదని చాలామంది వాదించేవారున్నారు.

శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు.... 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది.

శబరిమల  యాత్ర ప్రతి ఏడాది నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది.  ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ, మకరవిళక్కు  ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి నెలలో మకర సంక్రాంతి  రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు  శబరిమల అయ్యప్పదేవాలయాన్ని తెరచి పూజలు చేస్తారు.

అయ్యప్ప భక్తులు

 దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం  నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాలి.

41 రోజులు 

మండల పూజకు హాజరయ్యే వారు తప్పని సరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈ యాత్రలు స్వాములు ఒక గురుస్వామి (5 సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వాళ్ళు) నాయకత్వంలో ఒక బృందంగా బయలు దేరి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కెట్టు (గుడ్డతో చుట్టిన పూజా సామాగ్రి) ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది.  

మహిషి సంహారం

ఒకప్పుడు మహిషి అనే రాక్షసి తన సోదరుడైన మహిషాసురుని మరణానికి  దేవతలే కారణమని తెలుసుకుని దేవతలపై పగ సాధించడానికి ఘోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుండి చాలా వరాలు పొందింది. ఆ వరాలతో మనుషులను, దేవతలను హింసించేది.

మకర సంక్రాంతి 

అయ్యప్పస్వామి చాలా చిన్నవయస్సులోనే మకర సంక్రాంతి రోజున ఆ రాక్షసిని చంపాడట. ఆ తరువాత శబరిమలై కొండలలో దేవుడుగా వెలిసాడని, పురాణాలలో చెప్పబడినది. అప్పటినుండి ఆయన భక్తులచే పూజలందుకుంటున్నాడు.మకర విళక్కు మన మకరసంక్రాంతినే మకర విళక్కు అని కేరళలో అంటారు. ఈరోజునే అయ్యప్ప జ్యోతిలో కనపడతాడని భక్తులు లక్షల్లో వస్తూవుంటారు.


శబరిమల యాత్ర పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది. 

అయ్యప్ప జననం 

చైత్రమాసము, ఉత్తరా నక్షత్రం, చతుర్ధశి - సోమవారము నాడు జన్మించినారు . జ్యోతి రూపంగా అంతర్ధానమయిన రోజు - మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు.  తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో . ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు.

ఆరాధ్య దైవం 

అయ్యప్ప ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు. అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. 

అంతఃపురము

 సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. 

 మణికంఠుడు 

అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. 

అవతారపురుషుడు 

తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. 

 పులిపాలు 

గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేనువెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.  

 నియమం

 రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడు.  తాను ప్రతి ఏడాది మకర సంక్రాంతి నాడు భక్తులకు జ్యోతి రూపంలో దర్శనమిస్తానని  చెప్పి అంతర్దానమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి.

అలా అప్పటి నుంచి ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందుగా ఒక పక్షి ( గద్ద) వచ్చి ఆకాశంలో విహరించి.. నీకోసం భక్తులు ఎదురు చూస్తున్నారని స్వామిని...అయ్యప్పను ఆహ్వానించేందుకు... ఆకాశంలో మూడు సార్లు శబరికొండ ప్రాంతంలో మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తుంది.  ఆ తరువాత అయ్యప్ప స్వామి వారు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారని పురాణాలు చెబుతున్నాయి.. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. . . . .