ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్డొనేషన్క్యాంప్నిర్వహించారు. సిబ్బంది తలసేమియా చిన్నారుల కోసం రక్త దానం చేశారు. పండ్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్జడ్పీ హాల్లో నిర్వహించిన జాతీయ యువజనోత్సంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.
వివిధ పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్లకు మెమొంటోలు అందజేశారు. అనంతరం స్థానిక వివేకానంద చౌక్ లోని విగ్రహం వద్ద నివాళులర్పించారు. నిర్మల్ లోని వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కుభీర్ మండల కేంద్రంతోపాటు పల్సి, చొండి గ్రామాల్లో వివేకానంద జయంతి నిర్వహించారు. కుంటాల మండల కేంద్రంలో యువజనోత్సవం నిర్వహించారు.
లక్సెట్టిపేటలోని వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి నిర్వహించారు. మామడ మండలం పొన్కల్ హిందువాహిని శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, నేరడిగొండ మండల కేంద్రంలో ఏకల్ అభియాన్ ఆధ్వర్యంలో వివేకానంద ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని నివాళులర్పించారు.