- నేటి నుంచి శ్రీరామదివ్యక్షేత్రంలో ముక్కోటి ఉత్సవాలు ఆరంభం
భద్రాచలం,వెలుగు : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి వైకుంఠ ఏకాదశీ అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రోజుకో అవతారంలో స్వామి దర్శనం ఇవ్వనున్నారు. తొలిరోజు మత్స్య అవతారంలో రామయ్య భక్తులకు కనువిందు చేయనున్నారు. భక్తుల కోసం రూ.1.20కోట్ల వ్యయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా గోదావరి తీరంలో జనవరి 9న సాయంత్రం జరిపే తెప్పోత్సవం కోసం లాంచీని హంసావాహనం రూపంలో తయారు చేస్తున్నారు. 10న తెల్లవారు ఝామున వైకుంఠ ద్వారదర్శనం కోసం ఉత్తరద్వారాన్ని రెడీ చేస్తున్నారు. భక్తుల కోసం 2లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఈసారి రూ.18లక్షలతో గోపురంపై సీతారాముల లేజర్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తెప్పోత్సవం, ఉత్తరద్వారదర్శనం భక్తులు చూసేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.