పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఇందుకుగాను మహారాష్ట్ర ప్రభుత్వం అతనికి రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ అందించింది. అయితే కుశాల్ తండ్రి తన కొడుకుకు లభించిన రూ. 2 కోట్ల ప్రైజ్ మనీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. హర్యానా తన అథ్లెట్ల కోసం చాలా ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తోంది ఆయన నిరాశకు గురయ్యాడు.
కొల్హాపూర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ సురేష్ కుసాలే ఇలా అన్నాడు. "హర్యానా ప్రభుత్వం ఒలింపిక్స్ పతకం గెలుచుకున్న ప్రతి ఆటగాడికి రూ. 5 కోట్లు ఇస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం.. ఒలింపిక్ కాంస్య పతక విజేతకు రూ.2 కోట్లు లభిస్తాయి. స్వప్నిల్ మహారాష్ట్ర నుండి ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న రెండో వ్యక్తి. 72 ఏళ్ళ తర్వాత ఒలింపిక్ మెడల్ గెలుచుకున్నా రూ. 2 కోట్లే ఇస్తారా" అని ప్రశ్నించాడు.
సోమవారం తన కుమారుడికి రూ. 5 కోట్ల ప్రైజ్ మనీ, పూణేలోని బలేవాడిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో ఒక ఫ్లాట్ కావాలని చెప్పారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో (పుణెలో) 50 మీటర్ల త్రీ పొజిషన్ రైఫిల్ షూటింగ్ అరేనాకు తన కుమారుడి పేరు పెట్టాలని సురేష్ కుసాలే అన్నారు.