Paris Olympics 2024: ధోనీతో నాకు బంధం ఉంది.. ఒలింపిక్ విజేత స్వప్నిల్ కుసాలే

Paris Olympics 2024: ధోనీతో నాకు బంధం ఉంది.. ఒలింపిక్ విజేత స్వప్నిల్ కుసాలే

ఒలింపిక్స్ లో భాగంగా భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. గురువారం (జూలై 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్‌లో స్వప్నిల్ పతకాన్ని గెలిచాడు. బుధవారం (జూలై 31) క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో  సౌరభ్ కుసాలే ఏడో స్థానంలో నిలిచి పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ ఫైనల్స్ గురువారం(ఆగస్టు 1) జరగగా.. స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం గెలుచుకున్నాడు. 

పుణెకు చెందిన స్వప్నిల్ కుసాలే ఒలింపిక్స్ చరిత్రలో పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 స్థానాల ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా నిలిచాడు. స్వప్నిల్ కుసాలేకు టీమిండియా మాజీ కెప్టెన్ మధ్య ఒక కనెక్షన్ ఉంది. ఈ విషయాన్ని స్వప్నిల్ స్వయంగా చెప్పాడు. "ఎంఎస్ ధోనీని నేను ఆరాధిస్తాను. అతను మైదానంలో ఉన్నంత ప్రశాంతంగా.. ఓపికగా ఉండటం నా క్రీడకు అవసరం. నేను కూడా అతనిలాగే టిక్కెట్ కలెక్టర్‌ని కాబట్టి అతని కథతో నాకు సంబంధం ఉంది". అని స్వప్నిల్ చెప్పుకొచ్చాడు. 

స్వప్నిల్ కుసాలే – ఎంఎస్ ధోనీ కనెక్షన్

ఎంఎస్ ధోని లాగానే స్వప్నిల్ కుసాలే కూడా టిక్కెట్ కలెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. కుసాలే 2015 నుండి సెంట్రల్ రైల్వేస్‌లో పని చేస్తున్నారు. ఎక్కువగా పూణే ప్రాంతంలో సేవలందిస్తున్నారు. 2012 నుంచి అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటున్న అతను 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేశాడు.