Paris Olympics 2024: స్వప్నిల్ కుసాలే సంచలనం.. ఫైనల్‌కు అర్హత సాధించిన భారత షూటర్

Paris Olympics 2024: స్వప్నిల్ కుసాలే సంచలనం.. ఫైనల్‌కు అర్హత సాధించిన భారత షూటర్

భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటాడు. క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ఏడో స్థానంలో నిలిచి పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు ఫైనల్‌కు అర్హత సాధించారు. పుణెకు చెందిన స్వప్నిల్ కుసాలే ఒలింపిక్స్ చరిత్రలో పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 స్థానాల ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా నిలిచాడు.

స్వప్నిల్ పాయింట్ల పరంగా నిలకడను కనబరిచాడు. ప్రతి సిరీస్‌లో 99 పాయింట్లు సాధించాడు. 13 సందర్భాలలో 10 ఇన్నర్ రింగ్‌లను కొట్టాడు. స్టాండింగ్ పొజిషన్‌లో స్వప్నిల్ 98, 97 స్కోర్‌లను నమోదు చేశాడు. ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో స్వప్నిల్ 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. ఆగస్టు 1 న ఫైనల్ జరుగుతుంది. మరోవైపు ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్టాండింగ్ పొజిషన్ మూడో రౌండ్ చివరి దశలో తడబడ్డాడు. దీంతో 11వ స్థానంలో నిలిచి తదుపరి దశకు వెళ్లడంలో విఫలమయ్యాడు.