టాలీవుడ్లో విషాదం.. అమెరికాలో కన్నుమూసిన తెలుగు నటుడు

టాలీవుడ్లో విషాదం.. అమెరికాలో కన్నుమూసిన తెలుగు నటుడు

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్లో ప్రముఖ నటుడైన ఈశ్వరరావు (Eswara Rao) కన్నుమూశారు. ఆయన అక్టోబర్31న  అమెరికాలోని మిషిగాన్ లో ఉంటున్న అతని కూతురి ఇంట్లో అనారోగ్యంతో తుదిశ్వాసవిడిచారు. ఈ విషయం ఆయన చనిపోయిన మూడు రోజులు తరువాత ఆలస్యంగా బయటకి వచ్చింది. ఆయన మృతి పట్ల పులువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

ఆయన దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం(Swargam Narakam ) చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమాతోనే మోహన్ బాబు కూడా వెండితెరపై అడుగుపెట్టాడు. ఆయన నటించిన తొలి చిత్రంతోనే ఈశ్వరరావు నంది అవార్డును అందుకున్నాడు. ఈశ్వరరావు హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఆడదంటే అలుసా, తల్లి దీవెన, బొమ్మరిల్లు, కన్నవారి ఇల్లు, ప్రేమాభిషేకం, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, సంకెళ్ళు, ఘరానా మొగుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేశారు. దాదాపు ఆయన 200కు పైగా సినిమాలలో నటించాడు.

పలు టీవీ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకులకు మెప్పించాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈశ్వరరావు..చివరిగా ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో కనిపించి పలు విషయాలను పంచుకున్నారు.